Bakasura Restaurant Movie: కామెడీ ఎంటర్‌టైనర్
ABN, Publish Date - May 03 , 2025 | 06:07 AM
హాస్య నటుడు ప్రవీణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘బకాసుర రెస్టారెంట్’ చిత్ర ఫస్ట్‌లుక్ విడుదలైంది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అన్ని వర్గాలను ఆకట్టుకునే అంశాలు ఉంటాయని దర్శకుడు తెలిపారు.
ఇప్పటివరకూ పలు హాస్యపాత్రల్లో ప్రేక్షకులను మెప్పిస్తూ వచ్చిన ప్రవీణ్ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతోన్న చిత్రం ‘బకాసుర రెస్టారెంట్’. త్వరలో ప్రేక్షుల ముందుకు రానున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను శుక్రవారం యూనిట్ విడుదల చేసింది. చేతిలో గరిటెతో తీక్షణమైన చూపులతో కనిపిస్తున్న ప్రవీణ్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంతో ఎస్.జే శివ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. లక్ష్మయ్య ఆచారి, జనార్థన్ ఆచారి నిర్మిస్తున్నారు. వైవాహర్ష, కృష్ణ భగవాన్, షైనింగ్ ఫణి కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో అన్ని వర్గాలను అలరించే అంశాలున్నాయి. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు మా సినిమా నచ్చుతుంది’ అన్నారు. నటుడిగా ప్రవీణ్‌లోని కొత్తకోణాన్ని ఈ చిత్రంలో చూడబోతున్నారని నిర్మాతలు తెలిపారు. సంగీతం: వికాస్ బాడిస, సినిమాటోగ్రఫీ: బాల సరస్వతి