వినోదాత్మక చిత్రం
ABN , Publish Date - May 21 , 2025 | 01:28 AM
ప్రవీణ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న వినోదాత్మక చిత్రం ‘బకాసుర రెస్టారెంట్’. వైవా హర్ష టైటిల్ రోల్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా ఎస్‌జే శివ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎస్‌జే మూవీస్ బేనర్‌పై లక్ష్మయ్య ఆచారి...
ప్రవీణ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న వినోదాత్మక చిత్రం ‘బకాసుర రెస్టారెంట్’. వైవా హర్ష టైటిల్ రోల్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా ఎస్‌జే శివ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎస్‌జే మూవీస్ బేనర్‌పై లక్ష్మయ్య ఆచారి, జనార్ధన్ ఆచారి నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య దర్శకుడు మారుతి ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మారుతి మాట్లాడుతూ ‘ఈ సినిమాకు టైటిల్‌తోనే విజయం సాధించారు. సినిమా కూడా బాగుంటుందనే ఫీల్ కలుగుతోంది. కచ్చితంగా ఈ చిత్రం ప్రవీణ్ కెరీర్‌లో మైలురాయిగా నిలుస్తుంది’ అని అన్నారు. ప్రవీణ్ మాట్లాడుతూ ‘మారుతి చేతుల మీదుగా మా ట్రైలర్ రిలీజ్ అవడం సంతోషంగా ఉంది’ అని అన్నారు. చిత్ర దర్శకుడు ఎస్‌జే శివ మాట్లాడుతూ ‘ఈ చిత్రం ద్వారా ప్రవీణ్‌ను హీరోగా పరిచయం చేయడం ఆనందంగా ఉంది’ అని అన్నారు. ‘ఈ సినిమాలో కేజీఎఫ్ గరుడ పాత్ర అందరికీ నచ్చుతుంది’ అని నిర్మాత జనార్ధన్ ఆచారి చెప్పారు.