Badmashulu Telugu Movie: మిత్రబృందం స్నేహగీతం

ABN , Publish Date - May 24 , 2025 | 01:41 AM

గ్రామీణ నేపథ్యంలో రూపొందిన కుటుంబ కథా చిత్రం ‘బద్మాషులు’ జూన్‌ 6న విడుదల కానుంది. మిత్రబృందంపై చిత్రీకరించిన ‘జిందగీ బిలాలే’ అనే పాటను హీరో ప్రియదర్శి ఆవిష్కరించారు.

గ్రామీణ నేపథ్యంలో ఆద్యంతం వినోద ప్రధానంగా సాగే కుటుంబ కథా చిత్రం ‘బద్మాషులు’. మహేశ్‌, విద్యాసాగర్‌, మురళీధర్‌ గౌడ్‌ ప్రధాన తారాగణం. శంకర్‌ చేగూరి దర్శకత్వంలో బి. బాలకృష్ణ, సి. రామశంకర్‌ నిర్మిస్తున్నారు. జూన్‌ 6న ఈ చిత్రం విడుదలవుతోంది. తాజాగా చిత్రబృందం ‘జిందగీ బిలాలే’ అంటూ సాగే గీతాన్ని విడుదల చేసింది. మిత్రబృందంపై చిత్రీకరించిన ఈ గీతాన్ని హీరో ప్రియదర్శి చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ చిత్రానికి తేజ కూకునూరు సంగీతం అందించారు. చరణ్‌, అర్జున్‌, విహ ఆలపించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలతో ‘బద్మాషులు’ చిత్రాన్ని రూపొందించామని దర్శకుడు తెలిపారు.

Updated Date - May 24 , 2025 | 01:42 AM