బద్మాషులు వస్తున్నారు
ABN, Publish Date - May 13 , 2025 | 02:47 AM
ఆద్యంతం వినోద ప్రధానంగా సాగే కుటుంబ కథా చిత్రం ‘బద్మాషులు’. మహేశ్ చింతల, విద్యాసాగర్ కే, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రలు పోషించారు....
ఆద్యంతం వినోద ప్రధానంగా సాగే కుటుంబ కథా చిత్రం ‘బద్మాషులు’. మహేశ్ చింతల, విద్యాసాగర్ కే, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రలు పోషించారు. శంకర్ చేగూరి దర్శకత్వంలో సీ రామశంకర్, బి. బాలకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. జూన్ 6న ‘బద్మాషులు’ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. గ్రామంలోని ఓ స్నేహబృందం పంచే వినోదం అన్నివర్గాల ప్రేక్షకులను అలరించేలా ఉంటుందని నిర్మాతలు తెలిపారు. మన ఊరి కథ అనేలా సినిమా ఉంటుంది, పాత్రలు సహజంగా ఉంటాయి అని దర్శకుడు తెలిపారు.