Bad girls: నీలి నీలి ఆకాశం' పాట కంటే గొప్పగా

ABN , Publish Date - Aug 19 , 2025 | 10:12 PM

అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, రోహన్ సూర్య  కీలక పాత్రధారులుగా  ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమా తో మంచి విజయాన్ని అందుకున్న డైరెక్టర్ మున్నా ధూళిపూడి దర్శకత్వంలో వస్తున్న ఎంటర్టైనర్  ‘బ్యాడ్ గాళ్స్’.

అంచల్ గౌడ (Anchal Gowda), పాయల్ చెంగప్ప(Payal chengappa), రోషిణి, యష్ణ, రోహన్ సూర్య  కీలక పాత్రధారులుగా  ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమా తో మంచి విజయాన్ని అందుకున్న డైరెక్టర్ మున్నా ధూళిపూడి దర్శకత్వంలో వస్తున్న ఎంటర్టైనర్  ‘బ్యాడ్ గాళ్స్’ (Bad Girls). ‘కానీ చాలా మంచోళ్లు’ అనేది ట్యాగ్ లైన్.   నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్, ఎన్‌వీఎల్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై   శశిధర్ నల్లా, ఎమ్మాడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్ ఈ చిత్రాన్నీ నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ లిరిసిస్ట్ చంద్రబోస్ సాహిత్యం అందిస్తుండగా మెలోడీ కింగ్ అనూప్ రూబెన్స్ తన చక్కని భాణీలతో ఈ చిత్రానికి సంగీతం అందించారు. త్వరలో ఓ మెలోడీ పాటను  విడుదల చేయనున్నారు. 'ఇలా చూసుకుంటానే' అనే పాటకి చంద్రబోస్ సాహిత్యం అందించగా సిద్ శ్రీరామ్ పాడారు. ఈ పాటకు సంబంధించి విడుదల అయిన ప్రీ టీజర్ దూసుకుపోతుంది, ఇందులో  చంద్ర బోస్ గారు కూడా యాక్ట్ చేశారు. 

దర్శకుడు మున్నా ధూళిపూడి మాట్లాడుతూ 'ఇలా చూసుకుంటానే' అనే పాట ‘బ్యాడ్ గాళ్స్’ చిత్రం ద్వారా త్వరలో విడుదల చేస్తున్నాం. చంద్ర బోస్ అందించిన లిరిక్స్, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ స్వర పరిచిన పాట మరియు సిద్ శ్రీరామ్ పాడిన పాట 'నీలి నీలి ఆకాశం' పాట కంటే గొప్పగా వచ్చింది. త్వరలో విడుదల చేస్తాం. ‘బ్యాడ్ గాళ్స్’ అనేది పూర్తి ఎంటర్టైనర్ చిత్రం. జాతి రత్నాలు, మ్యాడ్ లాంటి హిలేరియస్ చిత్రాలు అమ్మాయిలు చేస్తే ఎలా ఉంటుందో అలాంటి చిత్రం మా ‘బ్యాడ్ గాళ్స్' అని తెలిపారు. 

Updated Date - Aug 19 , 2025 | 10:12 PM