సందడికి మళ్లీ సిద్ధం!
ABN , Publish Date - Apr 29 , 2025 | 04:12 AM
భారతీయ సినిమా చరిత్రలో ‘బాహుబలి’ చిత్రానికి ఎంతటి ప్రత్యేక స్థానం ఉందో చెప్పక్కల్లేదు. ఈ సినిమా మొదటి భాగం విడుదలై 10 ఏళ్లు అవుతోంది. ఈ సందర్భంగా...
భారతీయ సినిమా చరిత్రలో ‘బాహుబలి’ చిత్రానికి ఎంతటి ప్రత్యేక స్థానం ఉందో చెప్పక్కల్లేదు. ఈ సినిమా మొదటి భాగం విడుదలై 10 ఏళ్లు అవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత శోభు యార్లగడ్డ అభిమానులకు తీపికబురందించారు. ఈ సినిమాను అక్టోబర్‌లో రీ రిలీజ్ చేయనున్నట్లు ఎక్స్ వేదికగా ప్రకటించారు. ‘‘ఇది రీ రిలీజ్ మాత్రమే కాదు. ఈ సినిమా పదేళ్లు పూర్తిచేసుకున్నందుకు అభిమానులతో కలసి చేసుకునే వేడుక. మరిన్ని సర్‌ప్రైజ్‌లకు సిద్ధంగా ఉండండి’’ అని పేర్కొన్నారు. కాగా, ‘బాహుబలి: ద బిగినింగ్’ 2015లో జూలై 10న విడుదలవ్వగా, రెండో భాగం 2017 ఏప్రిల్ 28న విడుదలైంది.