ఊహించని కథతో మెప్పిస్తాం

ABN , Publish Date - May 16 , 2025 | 04:14 AM

హీరో అశ్విన్‌బాబు నటించిన తాజా చిత్రం ‘వచ్చినవాడు గౌతమ్‌’. ఈ థ్రిల్లర్‌కు మామిడాల ఎం.ఆర్‌ కృష్ణ దర్శకుడు. టి. గణపతిరెడ్డి నిర్మిస్తున్నారు....

హీరో అశ్విన్‌బాబు నటించిన తాజా చిత్రం ‘వచ్చినవాడు గౌతమ్‌’. ఈ థ్రిల్లర్‌కు మామిడాల ఎం.ఆర్‌ కృష్ణ దర్శకుడు. టి. గణపతిరెడ్డి నిర్మిస్తున్నారు. గురువారం నిర్వహించిన కార్యక్రమంలో దర్శకుడు శైలేశ్‌ కొలను, సంగీత దర్శకుడు తమన్‌ సినిమా టీజర్‌ను ఆవిష్కరించారు. మంచు మనోజ్‌ గంభీరమైన గొంతుతో మొదలైన టీజర్‌ యాక్షన్‌ మూడ్‌ను సెట్‌ చేసింది. అశ్విన్‌బాబు మాట్లాడుతూ ‘ఎవరూ ఊహించని ఒక కొత్త పాయింట్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. గణపతిరెడ్డి గారి వల్లే సినిమా గ్రాండియర్‌గా వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది’ అన్నారు. చిత్రబృందం కృషివల్లే ఒక మంచి సినిమాను తెరకెక్కించగలిగాం అని కృష్ణ చెప్పారు. ‘అశ్విన్‌ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు, ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అని గణపతిరెడ్డి చెప్పారు.

Updated Date - May 16 , 2025 | 04:14 AM