ఈసారి దేత్తడి

ABN , Publish Date - May 02 , 2025 | 01:58 AM

రౌడీ బాయ్స్‌, లవ్‌ మీ చిత్రాలతో హీరోగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఆశిష్‌. ఆదిత్యరావు గంగసాని దర్శకత్వంలో ఆయన హీరోగా ఓ చిత్రం (ఎస్‌వీసీ 60-వర్కింగ్‌ టైటిల్‌) తెరకెక్కుతోంది...

రౌడీ బాయ్స్‌, లవ్‌ మీ చిత్రాలతో హీరోగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఆశిష్‌. ఆదిత్యరావు గంగసాని దర్శకత్వంలో ఆయన హీరోగా ఓ చిత్రం (ఎస్‌వీసీ 60-వర్కింగ్‌ టైటిల్‌) తెరకెక్కుతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై రుతమ్‌ స్టోరీ ల్యాబ్‌తో కలసి దిల్‌రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. గురువారం ఆశిష్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా చిత్రబృందం టైటిల్‌ను ప్రకటించి, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ‘దేత్తడి’ అనే టైటిల్‌ను మేకర్స్‌ ఖరారు చేశారు. హైదరాబాద్‌ నేపథ్యంలో కథ సాగుతుంది. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో డప్పు వాద్యకారుడి గెట్‌పలో ఆశిష్‌ కనిపించారు.

Updated Date - May 02 , 2025 | 01:58 AM