Laxmi Chaitanya Director: జూన్‌లో విడుదల

ABN, Publish Date - May 03 , 2025 | 06:39 AM

నూతన నటీనటులైన ఆశిష్‌ గాంధీ, మానసా రాధాకృష్ణన్‌ల జంటగా తెరకెక్కుతున్న చిత్రాన్ని కిరణ్‌ కిట్టి, లక్ష్మీ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం జూన్‌లో విడుదల కాబోతోంది, గోపీ సుందర్‌ సంగీతం అందించారు.

నూతన నటీనటులు ఆశిష్‌ గాంధీ, మానసా రాధాకృష్ణన్‌లు జంటగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. కిరణ్‌ కిట్టి, లక్ష్మీ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. సోనుధి ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పతాకంపై ఆర్‌యూ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రం విడుదల తేదీని మేకర్స్‌ ప్రకటించారు. నిర్మాత మాట్లాడుతూ ‘ఈ సినిమాలో గోపీ సుందర్‌ స్వరపరిచిన ఆరుపాటలు ప్రత్యేకాకర్షణగా నిలుస్తాయి. త్వరలో టైటిల్‌ను ప్రకటించి ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేస్తాం, జూన్‌లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’ అని తెలిపారు. ‘మనసుకు హత్తుకునే భావోద్వేగాలున్న కథ ఇది. వాణిజ్య అంశాలకి, సామాజిక అంశాలను కలిపి తెరకెక్కించాం’ అని దర్శకులు తెలిపారు.

Updated Date - May 03 , 2025 | 06:40 AM