క్లైమాక్స్‌ మెప్పిస్తోంది

ABN , Publish Date - Apr 19 , 2025 | 03:33 AM

‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన ఆనందాన్ని ఇస్తోంది. విజయశాంతి గారితో కలసి ఈ సినిమా చేయడం గొప్ప అనుభూతినిచ్చింది. తల్లీ కొడుకుల అనుబంధం ప్రేక్షకులను...

‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన ఆనందాన్ని ఇస్తోంది. విజయశాంతి గారితో కలసి ఈ సినిమా చేయడం గొప్ప అనుభూతినిచ్చింది. తల్లీ కొడుకుల అనుబంధం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. శ్రీకాంత్‌ గారి పాత్రకు ప్రేక్షకుల నుంచి చక్కని స్పందన వస్తోంది. ‘ఇలాంటి క్లైమాక్స్‌ ఇండియన్‌ స్ర్కీన్‌ మీద ఇప్పటివరకూ చూడలేదు’ అని ప్రశంసలు అందుతున్నాయి. దర్శకుడు ప్రదీప్‌, నిర్మాత సునీల్‌, అశోక్‌ కష్టం వల్లే ప్రేక్షకులకు చేరువయ్యాం’ అని కల్యాణ్‌రామ్‌ అన్నారు. ఆయన కథానాయకుడిగా నటి ంచిన ఈ చిత్రానికి చక్కటి ప్రేక్షకాధరణ దక్కుతోన్న సందర్భంగా చిత్రబృందం మీడియాతో ముచ్చటించింది. దర్శకుడు ప్రదీప్‌ చిలుకూరి మాట్లాడుతూ ‘కల్యాణ్‌రామ్‌, విజయశాంతి గారి నటన ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. ప్రేక్షకులకు ధన్యవాదాలు’ అన్నారు. ఒక మంచి సినిమాలో భాగమైనందుకు సంతోషంగా ఉందని నిర్మాత సునీల్‌ బలుసు తెలిపారు. అన్ని ఏరియాల నుంచి సినిమాకు అద్భుతమైన స్పందన వస్తోంది అని శ్రీకాంత్‌ తెలిపారు.

Updated Date - Apr 19 , 2025 | 03:34 AM