Pre-Teaser: ఆ అల్లకల్లోలానికి కారణమేంటి?
ABN, Publish Date - Mar 15 , 2025 | 02:48 AM
నందమూరి కల్యాణ్‌రామ్, విజయశాంతి ప్రధాన పాత్రల్లో ప్రదీప్ చిలూకూరి దర్శకత్వంలో అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు తెరకెక్కిస్తోన్న చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’.
Cinema News: నందమూరి కల్యాణ్‌రామ్, విజయశాంతి ప్రధాన పాత్రల్లో ప్రదీప్ చిలూకూరి దర్శకత్వంలో అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు తెరకెక్కిస్తోన్న చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ఈ చిత్రంలో విజయశాంతి శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడులైన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది. తాజాగా ప్రీ- టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. కల్యాణ్‌రామ్ ఒక పడవపై కూర్చుని, సముద్రం వైపు చూస్తూ కనిపిస్తున్నారు. రక్తంతో తడిసిన అతని చొక్కా, అతని జీవితం చుట్టూ ఉన్న అల్లకల్లోలాన్ని సూచిస్తోంది.
పడవలు దగ్గరకు వస్తున్నప్పుడు జరగబోయే పెద్ద యుద్ధాన్ని అతని ఉగ్రరూపం హెచ్చరిస్తోంది. అజనీష్ లోక్‌నాథ్ స్వరపరచిన నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంది. ఈనెల 17న టీజర్‌ని విడుదల చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది.