చిన్ని చిన్ని తప్పులేవో
ABN , Publish Date - May 27 , 2025 | 03:15 AM
‘అర్థనారి’ చిత్రంతో హీరోగా పరిచయమైన అర్జున్ అంబటి ఆ తర్వాత ‘తెప్ప సముద్రం’, ‘వెడ్డింగ్ డైరీస్’ చిత్రాల్లో నటించారు. ఆయన తాజా చిత్రం ‘పరమపద సోపానం’. జెన్నీఫర్...
‘అర్థనారి’ చిత్రంతో హీరోగా పరిచయమైన అర్జున్ అంబటి ఆ తర్వాత ‘తెప్ప సముద్రం’, ‘వెడ్డింగ్ డైరీస్’ చిత్రాల్లో నటించారు. ఆయన తాజా చిత్రం ‘పరమపద సోపానం’. జెన్నీఫర్ ఇమ్మాన్యుయేల్ కథానాయిక. దర్శకుడు పూరి జగన్నాథ్ దగ్గర శిష్యరికం చేసిన నాగ శివ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. గిడిమిట్ల శివ ప్రసాద్ నిర్మాత. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ థ్రిల్లర్ మూవీ జూలై 11న విడుదల కానుంది.ఈ సందర్బంగా ‘చిన్ని చిన్ని తప్పులేవో’ పాటను విడుదల చేశారు. రాంబాబు గోశాల రాసిన పాటను పృథ్వీ చంద్ర, అదితి భావరాజు పాడారు. డేవ్ జాండ్ సంగీత దర్శకుడు. ఈ చిత్రానికి గుడిమెట్ల ఈశ్వర్ సహ నిర్మాత.