Arjun Ambati Movie: భూమ్‌.. భూమ్‌

ABN , Publish Date - Jun 01 , 2025 | 03:05 AM

అర్జున్ అంబటి నటించిన తాజా చిత్రం ‘పరమపద సోపానం’ జూలై 11న విడుదల కాబోతుంది. గీతా మాధురి గానం చేసిన ‘భూమ్ భూమ్’ అనే పాట యూనిట్ విడుదల చేసింది.

‘అర్థనారి’, ‘తెప్ప సముద్రం’, ‘వెడ్డింగ్‌ డైరీస్‌’ వంటి వైవిధ్యమైన చిత్రాల్లో హీరోగా నటించిన అర్జున్‌ అంబటి తాజా చిత్రం ‘పరమపద సోపానం’. నాగ శివ దర్శకత్వంలో గుడిమట్ల శివప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం జూలై 11న విడుదల కానుంది. ఇటీవల ‘చిన్ని చిన్న తప్పులేవో’ పాటను విడుదల చేసిన యూనిట్‌ ఇప్పుడు ‘భూమ్‌ భూమ్‌’ అనే పెప్సీ మాస్‌ నంబర్‌ను రిలీజ్‌ చేసింది. గీతా మాధురి పాడిన ఈ పాటను రాంబాబు గోశాల రాశారు. డేవ్‌ జాండ్‌ సంగీత దర్శకుడు. హీరోయిన్‌ నమ్రితపై ఈ పాటను చిత్రీకరించారు.

Updated Date - Jun 01 , 2025 | 03:06 AM