ఏఆర్ రెహ్మాన్ రూ.2 కోట్లు చెల్లించాలి
ABN , Publish Date - Apr 27 , 2025 | 01:12 AM
దర్శకుడు మణిరత్నం రూపొందించిన ‘పొన్నియిన్ సెల్వన్-2’ మూవీలోని ‘వీరా రాజ వీర’ పాటకు సంబంధించిన కాపీరైట్ కేసులో సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ హైకోర్టు రిజిస్ట్రార్‌కు రూ.2 కోట్లు, పిటిషన్‌దారుడికి...

ఢిల్లీ హైకోర్టు ఆదేశం
దర్శకుడు మణిరత్నం రూపొందించిన ‘పొన్నియిన్ సెల్వన్-2’ మూవీలోని ‘వీరా రాజ వీర’ పాటకు సంబంధించిన కాపీరైట్ కేసులో సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ హైకోర్టు రిజిస్ట్రార్‌కు రూ.2 కోట్లు, పిటిషన్‌దారుడికి రూ.2 లక్షలు చెల్లించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. పద్మశ్రీ అవార్డు గ్రహీత, భారత శాస్త్రీయ గాయకుడు ఫయాజ్ వాసిఫుద్దీన్ ఠాకూర్ 2023లో ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ‘పొన్నియిన్ సెల్వన్-2’ మూవీలోని ఏఆర్ రెహ్మాన్ స్వరపరిచిన ‘వీరా రాజ వీరా’ పాట తన తండ్రి నజీర్ ఫయాజుద్దీన్ ఠాకూర్, మామ జహీరుద్దీన్ ఠాకూర్‌లు స్వరపరిచిన శివస్తుతి పాట నుంచి కాపీ చేశారని, అందువల్ల ఈ పాటను ఎక్కడా ఉపయోగించకుండా ఏఆర్ రెహ్మాన్, మద్రాస్ టాకీ్‌సలను ఆదేశించాలని, అలాగే కాపీరైట్ చట్టం కింద తనకు పరిహారం చెల్లించాలని అభ్యర్థించారు. అదే సమయంలో రెహ్మాన్ తరపున కూడా కౌంటర్ దాఖలు చేయడం జరిగింది. వీటిని నిశితంగా పరిశీలించి, పలు దఫాలుగా విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు శుక్రవారం తుదితీర్పును వెలువరించింది.
ఈ కేసులో రెహ్మాన్ తరపు న్యాయవాదులు వినిపించిన వాదనలను తోసిపుచ్చి.. కాపీరైట్ చట్టం కింద రూ.2 కోట్లను హైకోర్టు రిజిస్ట్రార్‌కు, పిటిషన్‌దారుడికి రూ.2 లక్షలు చెల్లించాలని ఆదేశించింది.
చెన్నై (ఆంధ్రజ్యోతి)