Racharikam: అప్సరా రాణి ‘రాచరికం’ ట్రైలర్ ఎలా ఉందంటే..
ABN , Publish Date - Jan 08 , 2025 | 11:14 PM
అప్సరా రాణి ఇప్పటి వరకు ఐటమ్ గాళ్‌గానే అందరికీ తెలుసు. కానీ ఫస్ట్ టైమ్ ఆమెకు నటనకు ఆస్కారమున్న పాత్ర లభించింది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘రాచరికం’. ఈ చిత్ర ట్రైలర్‌ను బుధవారం మేకర్స్ మారుతి చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఎలా ఉందంటే..
అప్సరా రాణి, విజయ్ శంకర్, వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘రాచరికం’. చిల్ బ్రోస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈశ్వర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సురేశ్ లంకలపల్లి, ఈశ్వర్ వాసె దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ మూవీకి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై క్రేజ్‌ని పెంచింది. తాజాగా మేకర్స్ డైరెక్టర్ మారుతి చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది.
Also Read- Game Changer: ‘గేమ్ చేంజర్’కు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఎవరూ ఊహించి ఉండరు కదా..
ఈ ట్రైలర్‌లో అప్సరా రాణి, విజయ్ శంకర్, వరుణ్ సందేశ్ కనిపించిన తీరు, డిఫరెంట్ లుక్స్, నటించిన విధానం చాలా కొత్తగా ఉంది. విలేజ్ పొలిటికల్ రివేంజ్ డ్రామాగా రాబోతున్న ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులకు ఊర మాస్ ఫీస్ట్ ఇవ్వబోతుందనేది తెలుస్తోంది. ‘రాచకొండ ఒక అడవి లాంటిదబ్బా.. ఈడ బలంతో పోరాడే పులులు, బలగంతో పోరాడే ఏనుగులు, ఎత్తుకు పై ఎత్తు వేసే గుంట నక్కలు, కాసుకుని కాటేసే విష సర్పాలు ఉంటాయి.. వాటి మధ్య జరిగే పోరులో రక్త పాతాలే తప్పా రక్త సంబంధాలు ఉండవు’ అనే డైలాగ్‌తో సాగిన ఈ ట్రైలర్ ఆద్యంతం అద్భుతంగా ఉంది. విజువల్స్, యాక్షన్, బీజీఎం ఇలా అన్నీ నెక్స్ట్ లెవల్ అనేలా ఉన్నాయి.
మరీ ముఖ్యంగా వరుణ్ సందేశ్ ఈ సినిమాలో విలన్‌గా నటించినట్లుగా తెలుస్తుంది. ఆయనలో ఇది సరికొత్త కోణం. అలాగే ఇప్పటి వరకు ఐటమ్ గాళ్‌గానే కనిపించిన అప్సరా రాణి ఈ సినిమాలో ఫెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్ర చేసినట్లుగా ఈ ట్రైలర్ చెప్పేస్తోంది. మొత్తంగా అయితే ఈ ట్రైలర్ సినిమా గురించి మాట్లాడుకునేలా చేస్తోంది. ఈ సినిమాను ఫిబ్రవరి 1న విడుదల చేయనున్నారు.