సినిమా టికెట్ రేట్ల ఖరారుపై కమిటీ
ABN , Publish Date - May 15 , 2025 | 03:00 AM
ఏపీలో సినిమా టికెట్ల ధరలను పునః పరిశీలించి ఖరారు చేసేందుకు ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. సినీ నిర్మాత వివేక్ కూచిభొట్ల చైౖర్మన్‌గా వ్యవహరించే ఈ కమిటీలో హోం, ఫైనాన్స్, సమాచార, ప్రసార శాఖ ముఖ్య...
ఏపీలో సినిమా టికెట్ల ధరలను పునః పరిశీలించి ఖరారు చేసేందుకు ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. సినీ నిర్మాత వివేక్ కూచిభొట్ల చైౖర్మన్‌గా వ్యవహరించే ఈ కమిటీలో హోం, ఫైనాన్స్, సమాచార, ప్రసార శాఖ ముఖ్య కార్యదర్శులు, లా సెక్రటరీ సభ్యులుగా ఉంటారు. వారితో పాటు చిత్ర నిర్మాత వివేక్ కూచిభొట్లకు కూడా ఈ కమిటీలో సభ్యుడిగా అవకాశం దక్కింది. గత వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన టికెట్ ధరల జీవో 35తోపాటు జీవో 13పైనా ఎగ్జిబిటర్లు, సినీ నిర్మాతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించారు. వైసీపీ ప్రభుత్వ వివాదాస్పద జీవోలు, కోర్టులో పిటిషన్లు, ప్రేక్షకుల అభిప్రాయాలు, ఎగ్జిబిటర్ల వినతులు, సినీ పరిశ్రమ పెద్దల సూచనలు పరిగణలోకి తీసుకుని సమగ్ర నివేదిక సమర్పించాలని ప్రభుత్వం కమిటీకి బాధ్యత అప్పగించింది. ఈ నివేదిక ఆధారంగా రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలపై ప్రభుత్వం సముచిత నిర్ణయం తీసుకోనుంది.
అమరావతి (ఆంధ్రజ్యోతి)