సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
ABN , Publish Date - May 25 , 2025 | 03:49 AM
సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంతి దుర్గేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. జూన్ 1 నుంచి...
ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి దుర్గేష్
సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంతి దుర్గేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు మూసివేయాలన్న ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల నిర్ణయంపై ఆరా తీస్తున్నామన్నారు. సినీరంగ పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య అనుకూల వాతావరణం ఉందన్నారు. సినీ పరిశ్రమ అభివృద్ధి కోసమే నూతన ఫిల్మ్ పాలసీ తెస్తున్నామన్నారు. చిత్ర పరిశ్రమకు, ఎగ్జిబిటర్లకు డిస్ట్రిబ్యూటర్లకు, ప్రొడ్యూసర్‌లకు ఉపయోగపడే విధంగా నిర్ణయాలు తీసుకునేందుకు హోంశాఖ ముఖ్యకార్యదర్శి నేతృత్వంలో విచారణ చేపడుతున్నామన్నారు. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ సినీపరిశ్రమకు చెందిన వారితో ప్రత్యేక సమావేశం నిర్వహించి సమస్యలను ఆరా తీసి పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని భరోసా ఇచ్చారని చెప్పారు. ‘హరిహర వీరమల్లు’ సినిమా విడుదలకు ముందు ఈ తరహ వ్యవహారం దేనికి సంకేతమని మంత్రి ప్రశ్నించారు.
రాజమహేంద్రవరం సిటీ ( ఆంధ్రజ్యోతి)
ప్రశ్నించుకోవాల్సిన సమయం వచ్చింది
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ వ్యాఖ్యలపై, చిత్ర పరిశ్రమలోని పరిస్థితులపై నిర్మాతలు బన్నీవాసు, నాగవంశీ స్పందించారు. ‘‘సినీ ఇండస్ట్రీలో రాజకీయాలు చాలా సైలెంట్‌గా.. లోతుగా ఉంటాయి. ఈ రాజకీయాల్లో పరిశ్రమ నలిగిపోతోందనే వాస్తవాన్ని ఇప్పటికైనా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు గ్రహించాలి. సినిమాల నుంచే వెళ్లి, డిప్యూటీ సీఎం అయిన వారికే మనం ఆగ్రహం తెప్పించామంటే.. మన ఐకమత్యాన్ని ప్రశ్నించుకోవాల్సిన సమయమిది’’
- బన్నీవాసు
‘‘పెద్ద సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టాల్సిన సమయంలో.. అనవసరం లేని సమస్యలను సృష్టించారు. ఇప్పుడు అవే పెరిగి పెద్దవయ్యాయి. విచక్షణతో ఆలోచించి ఉంటే పరిస్థితి దాకా వచ్చేది కాదు.. ఇలాంటి సమస్యలూ వచ్చేవి కావు’’
- నాగవంశీ