Anupam : ప్రభాస్‌ సినిమాలో అనుపమ్‌

ABN, Publish Date - Feb 15 , 2025 | 06:14 AM

ప్రభాస్‌ హీరోగా హనురాఘవపూడి దర్శకత్వంలో ఓ పాన్‌ ఇండియా మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్న

ప్రభాస్‌ హీరోగా హనురాఘవపూడి దర్శకత్వంలో ఓ పాన్‌ ఇండియా మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ఖేర్‌ నటించనున్నారు. ఈ విషయాన్ని అనుపమ్‌ఖేర్‌ తన సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ‘ఇండియన్‌ సినిమా బాహుబలి ప్రభా్‌సతో నా 544వ చిత్రాన్ని ప్రకటించినందుకు ఆనందంగా ఉంది. ఈ చిత్రానికి అద్భుతమైన ప్రతిభావంతులైన హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు’ అని ఆయన పేర్కొన్నారు.

Updated Date - Feb 15 , 2025 | 06:14 AM