నా కెరీర్‌లో ఇదే బెస్ట్ క్యారెక్టర్
ABN , Publish Date - Jan 07 , 2025 | 06:45 AM
రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’. దిల్‌రాజు, శిరీష్ నిర్మించారు. ఈనెల 10న తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా..
రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’. దిల్‌రాజు, శిరీష్ నిర్మించారు. ఈనెల 10న తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా సినీ నటి అంజలి మాట్లాడుతూ‘ ఈ సంక్రాంతికి తెలుగులో ‘గేమ్ ఛేంజర్’, తమిళంలో విశాల్ చిత్రం రాబోతున్నాయి. ఈ రెండు చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నా. ‘గేమ్ ఛేంజర్’లో నా పాత్ర పేరు పార్వతి. మా అమ్మ పేరు కూడా పార్వతి. డైరెక్టర్ కథ చెప్పినప్పుడు, క్యారెక్టర్ చెప్పినప్పుడు మా అమ్మే గుర్తుకు వచ్చారు. సెట్స్ నుంచి వచ్చాక కూడా ఈ పాత్ర చాలా రోజులు నన్ను వెంటాడుతూనే వచ్చింది. నా కెరీర్‌లో ఇదే బెస్ట్ క్యారెక్టర్. రామ్ చరణ్ తన కో స్టార్స్‌ని ఎంతో గౌరవిస్తారు. సెట్స్‌లో అందరితోనూ చక్కగా మాట్లాడతారు. అప్పన్న, పార్వతీల ప్రేమ, వారి బంధం చాలా గొప్పగా ఉంటుంది. శంకర్, మణిరత్నం చిత్రాల్లో నటించాలని అందరికీ ఉంటుంది. శంకర్ చిత్రంలో నటించే అవకాశం రావడం అనందంగా ఉంది. ‘గేమ్ ఛేంజర్’ వల్ల నా ఆలోచనాధోరణి మారింది. ఈ ప్రయాణంలో ఎంతో నేర్చుకున్నా’.