ఆంధ్రా కింగ్‌ తాలూకా

ABN , Publish Date - May 16 , 2025 | 04:11 AM

రామ్‌ పోతినేని కథానాయకుడిగా మహేశ్‌బాబు పి. దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ బేనర్‌పై నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ భారీ బడ్జెట్‌తో...

రామ్‌ పోతినేని కథానాయకుడిగా మహేశ్‌బాబు పి. దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ బేనర్‌పై నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. ఉపేంద్ర కీలకపాత్ర పోషిస్తున్నారు. గురువారం చిత్రబృందం టైటిల్‌ను ప్రకటించింది. ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్‌లో రామ్‌ స్టైలిష్‌ లుక్‌లో ఆకట్టుకున్నారు. రావు రమేశ్‌, మురళీ శర్మ, రాహుల్‌ రామకృష్ణ కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: వివేక్‌ - మెర్విన్‌, సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ నుని.

Updated Date - May 16 , 2025 | 04:11 AM