జంటగా మరోసారి
ABN , Publish Date - May 16 , 2025 | 04:12 AM
‘బేబీ’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన ఆనంద్ దేవరకొండ - వైష్ణవి చైతన్య కలసి మరోసారి ప్రేక్షకులను అలరించబోతున్నారు...
‘బేబీ’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన ఆనంద్ దేవరకొండ - వైష్ణవి చైతన్య కలసి మరోసారి ప్రేక్షకులను అలరించబోతున్నారు. వీరిద్దరు జంటగా ఆదిత్య హాసన్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతోంది. ఈ సినిమా పూజా కార్యక్రమంతో ఘనంగా ప్రారంభమైంది. హీరోయిన్ రష్మిక మందన్న క్లాప్ కొట్టగా, నటుడు శివాజీ కెమెరా స్విచ్చాన్ చేశారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. జూన్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని మేకర్స్ తెలిపారు.