ప్రేక్షకులు మెచ్చే ప్రేమకథ
ABN , Publish Date - Jan 06 , 2025 | 06:21 AM
తమిళ దర్శకుడు విక్రమన్ తనయుడు విజయ్ కనిష్క, హీరోగా, గరిమ చౌహాన్ హీరోయిన్‌గా నటిస్తున్న ‘కలవరం’ చిత్రం షూటింగ్ హైదరాబాద్ సారథీ స్టూడియోలో ప్రారంభమైంది. విజయ్, రాజ్ తిరందాసుపై చిత్రీకరించిన...
తమిళ దర్శకుడు విక్రమన్ తనయుడు విజయ్ కనిష్క, హీరోగా, గరిమ చౌహాన్ హీరోయిన్‌గా నటిస్తున్న ‘కలవరం’ చిత్రం షూటింగ్ హైదరాబాద్ సారథీ స్టూడియోలో ప్రారంభమైంది. విజయ్, రాజ్ తిరందాసుపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కు చదలవాడ శ్రీనివాసరావు కెమెరా స్విచాన్ చేయగా, నిర్మాత సి.కల్యాణ్ తొలి క్లాప్ ఇచ్చారు, హనుమాన్ వాసంశెట్టి దర్శకత్వంలో సీఎల్‌ఎన్ మీడియా సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. నిర్మాత శోభారాణి మాట్లాడుతూ ‘ఈ సినిమాకు ‘కలవరం’ పర్ఫెక్ట్ టైటిల్. ఇందులో 70 మంది ఆర్టిస్టులు ఉన్నారు. ప్రేక్షకులు మెచ్చే సినిమా అవుతుంది’ అన్నారు.