హారర్‌ థ్రిల్లర్‌ అమరావతికి ఆహ్వానం

ABN , Publish Date - May 19 , 2025 | 03:28 AM

శివ కంఠంనేని, ఎస్తర్‌, ధన్య బాలకృష్ణ, సుప్రీత, హరీశ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్న హారర్‌, థ్రిల్లర్‌ ‘అమరావతికి ఆహ్వానం’ షూటింగ్‌ పూర్తయింది. ఇప్పటికే ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం...

శివ కంఠంనేని, ఎస్తర్‌, ధన్య బాలకృష్ణ, సుప్రీత, హరీశ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్న హారర్‌, థ్రిల్లర్‌ ‘అమరావతికి ఆహ్వానం’ షూటింగ్‌ పూర్తయింది. ఇప్పటికే ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కోసం ఇటీవల 20 రోజుల పాటు మధ్యప్రదేశ్‌లో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. జీవీకె దర్శకత్వంలో కె.ఎ్‌స.శంకరరావు, ఆర్‌.వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు శివ కంఠంనేని మాట్లాడుతూ ‘ప్రజెంట్‌ ట్రెండ్‌ను దృష్టిలో పెట్టుకుని దర్శకుడు జీవీకే ఓ మంచి హారర్‌, థ్రిల్లర్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. టెక్నికల్‌గా కూడా చిత్రం బాగుంటుంది’ అని తెలిపారు. సరికొత్త కథాంశంతో వస్తున్న సినిమా ఇదనీ, ప్రేక్షకుల్ని తప్పకుండా అలరిస్తుందనీ దర్శకుడు చెప్పారు.

Updated Date - May 19 , 2025 | 03:28 AM