Amaravathi Ki aahwanam: మ‌ధ్య ప్ర‌దేశ్ షెడ్యూల్ పూర్తి.. విషయం ఏంటంటే.. 

ABN, Publish Date - May 17 , 2025 | 07:32 PM

హార‌ర్ సినిమాల ట్రెండ్ నడుస్తో న్న సమయమిది. మంచి క‌థాబ‌లంతో తెర‌కెక్కిన హార‌ర్‌, థ్రిల్ల‌ర్ చిత్రాల‌కు థియేట‌ర్స్‌లోనే కాకుండా ఓటీటీల్లోనూ మంచి డిమాండ్ ఉంది.



హార‌ర్ సినిమాల ట్రెండ్ నడుస్తో న్న సమయమిది. మంచి క‌థాబ‌లంతో తెర‌కెక్కిన హార‌ర్‌, థ్రిల్ల‌ర్ చిత్రాల‌కు థియేట‌ర్స్‌లోనే కాకుండా ఓటీటీల్లోనూ మంచి డిమాండ్ ఉంది. ఆ కోవ‌లోనే ఉత్కంఠ‌భ‌రిత‌మైన‌ క‌థ, క‌థ‌నంతో తెర‌కెక్కుతోన్న హార‌ర్ థ్రిల్ల‌ర్ 'అమ‌రావ‌తికి ఆహ్వానం' (Amaravathi Ki aahwanam). శివ కంఠంనేని, ఎస్త‌ర్‌, ధ‌న్య బాల‌కృష్ణ‌, సుప్రిత‌, హ‌రీష్ ప్ర‌ధాన పాత్ర‌ల‌తో తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో సీనియ‌ర్ న‌టులు అశోక్ కుమార్‌, భ‌ద్ర‌మ్‌, జెమిని సురేష్, నాగేంద్ర ప్రసాద్ కీల‌క‌పాత్ర‌లు పోషించారు.  డైరెక్ట‌ర్ జివికె ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బేన‌ర్‌పై కేఎస్ శంక‌ర్‌రావు, ఆర్ వెంక‌టేశ్వ‌ర రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ఇప్ప‌టికే ఆంధ్ర ప్ర‌దేశ్‌, తెలంగాణ‌లో షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ తాజాగా  మ‌ధ్య ప్ర‌దేశ్ షెడ్యూల్   కంప్లీట్ చేశారు. మ‌ధ్య ప్రదేశ్ చింద్వార జిల్లాలోని తామ్య హిల్స్‌, పాతాళ్ కోట్‌, బిజోరి, చిమ్‌తీపూర్ వంటి ప‌లు అంద‌మైన లొకేష‌న్స్‌లో దాదాపు 20 రోజుల పాటు చిత్రీక‌ర‌ణ జ‌రిపారు.  


హీరో శివ కంఠంనేని మాట్లాడుతూ "అమ‌రావ‌తికి ఆహ్వానం టైటిల్ కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ప్ర‌జెంట్ ట్రెండ్‌ని దృష్టిలో పెట్టుకుని ద‌ర్శ‌కుడు జీవీకే ఒక మంచి హార‌ర్ థ్రిల్ల‌ర్‌గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.  టెక్నిక‌ల్‌గా కూడా ఈ సినిమా చాలా బాగుంటుంది. ఇప్ప‌టికే ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ‌లోని ప‌లు లొకేష‌న్స్‌లో షూటింగ్ పూర్తి అయింది. తాజాగా మ‌ధ్య ప్ర‌దేశ్‌లో చిత్రీక‌ర‌ణ పూర్తి చేశాం. ఔట్ పుట్ చాలా బాగా వ‌చ్చింది`` అన్నారు

ద‌ర్శ‌కుడు జివికె మాట్లాడుతూ "స‌రికొత్త హార‌ర్ థ్రిల్ల‌ర్ క‌థాశంతో వ‌స్తోన్న చిత్రం అమ‌రావ‌తికి ఆహ్వానం. వీ ఎఫ్ ఎక్స్‌కి కూడా మంచి ప్రాధాన్య‌త ఉంటుంది. జె ప్రభాక‌ర్ రెడ్డి గారి విజువ‌ల్స్, హ‌నుమాన్ ఫేమ్ సాయిబాబు త‌లారి ఎడిటింగ్ ఈ సినిమాకు ప్ల‌స్ అవుతాయి. పద్మ‌నాబ్ బ‌ర‌ద్వాజ్ గారి సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హార‌ర్ మూడ్ ని క్యారీ చేస్తుంది" అని అన్నారు. 

 

Updated Date - May 17 , 2025 | 07:32 PM