అల్లు అర్జున్‌కు జోడీగా?

ABN , Publish Date - May 01 , 2025 | 06:03 AM

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే...

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్‌ పుట్టినరోజున ప్రకటించిన ఈ సినిమా వర్కింగ్‌ టైటిల్‌ ‘ఏఏ 22.. అట్లీ 6’. భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలు నటించనున్నారు. ఇప్పటికే జాన్వీ కపూర్‌, మృణాల్‌ ఠాకూర్‌ను ఫైనల్‌ చేసినట్లు సమాచారం. మరో కథానాయికగా ‘లైగర్‌’ ఫేమ్‌ అనన్యా పాండేను ఎంపిక చేసినట్లు టాక్‌. ఈ సినిమాలో నటించడానికి మేకర్స్‌ అనన్యను సంప్రదించగా, ఆమె గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Updated Date - May 01 , 2025 | 06:03 AM