జోరుగా ప్రీ ప్రొడక్షన్
ABN , Publish Date - May 22 , 2025 | 06:10 AM
అల్లు అర్జున్ కథానాయకుడిగా తమిళ దర్శకుడు అట్లీ ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ‘ఏఏ22.. ఏ6’ వర్కింగ్ టైటిల్. సన్ పిక్చర్స్ పతాకంపై...
అల్లు అర్జున్ కథానాయకుడిగా తమిళ దర్శకుడు అట్లీ ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ‘ఏఏ22.. ఏ6’ వర్కింగ్ టైటిల్. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించనున్నారు. ఇటీవలె సినిమాను అనౌన్స్ చేసి ఓ ఆసక్తికరమైన వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ పనుల్లో భాగంగా దర్శకుడు అట్లీ బుధవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. అల్లు అర్జున్‌ను కలసి ప్రీ ప్రొడక్షన్ పనులను చర్చించనున్నారు. జూన్‌లో చిత్రీకరణను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కనున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఓ కొత్త లోకంలోకి తీసుకెళ్లేలా ఉంటుందని మేకర్స్ తెలిపారు.