మహాకాళి తో తెలుగులో తొలి అడుగు
ABN, Publish Date - May 14 , 2025 | 05:44 AM
‘ఛావా’ చిత్రంలో ఔరంగజేబుగా అద్భుతంగా నటించి అందరి దృష్టినీ ఆకట్టుకున్నాడు బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా. ఆ సినిమా తర్వాత ఆర్టి్‌స్టగా ఆయనకు డిమాండ్ బాగా పెరిగింది. నిర్మాతల తాకిడి...
‘ఛావా’ చిత్రంలో ఔరంగజేబుగా అద్భుతంగా నటించి అందరి దృష్టినీ ఆకట్టుకున్నాడు బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా. ఆ సినిమా తర్వాత ఆర్టి్‌స్టగా ఆయనకు డిమాండ్ బాగా పెరిగింది. నిర్మాతల తాకిడి ఎక్కువైంది. అక్షయ్ తదుపరి చిత్రం ఏమిటాని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో ‘మహాకాళి’ తెలుగు చిత్రం అంగీకరించి అందరినీ ఆశ్చర్యపరిచారు అక్షయ్. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ పతాకంపై ప్రశాంత్ వర్మ ఫస్ట్ ఫిమేల్ సూపర్ హీరో కాన్సె్‌ప్టతో నిర్మిస్తున్న ‘మహాకాళి’ చిత్రంలో అక్షయ్ ఖన్నా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇంతకుముందు ‘మార్టిన్ లూథర్‌కింగ్’ చిత్రాన్ని రూపొందించిన పూజ కొల్లూరు ఈ సినిమాకు దర్శకురాలు. సోమవారం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో మొదలైంది. ఈ సినిమాలో ‘మహాకాళి’ పాత్రను పోషించే స్టార్ హీరోయిన్ కోసం ప్రస్తుతం అన్వేషణ సాగుతోంది.