తెలుగులో కేసరి ఛాప్టర్ 2
ABN , Publish Date - May 15 , 2025 | 02:48 AM
అక్షయ్‌కుమార్ కథానాయకుడిగా నటించిన బాలీవుడ్ చిత్రం ‘కేసరి: ఛాప్టర్ 2’. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం హిందీ బెల్ట్‌లో చక్కటి ఆదరణతో కొనసాగుతోంది....
అక్షయ్‌కుమార్ కథానాయకుడిగా నటించిన బాలీవుడ్ చిత్రం ‘కేసరి: ఛాప్టర్ 2’. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం హిందీ బెల్ట్‌లో చక్కటి ఆదరణతో కొనసాగుతోంది. కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆర్. మాధవన్, అనన్యపాండే కీలకపాత్రలు పోషించారు. ఇప్పడు ఈ చిత్రం తెలుగు వెర్షన్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సురేశ్ ప్రొడక్షన్స్ ఈ చిత్రం తెలుగు హక్కులు దక్కించుకుంది. ఈ నెల 23న ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నట్లు సురేశ్ ప్రొడక్షన్స్ తెలిపింది. జలియన్ వాలాబాగ్ హత్యాకాండ తర్వాత బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన న్యాయవాది సి. శంకరన్ నాయర్ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది.