18 ఏళ్ల తర్వాత మళ్లీ
ABN , Publish Date - May 04 , 2025 | 03:04 AM
పద్దెనిమిది ఏళ్ల తర్వాత అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ కలసి బాలీవుడ్ స్ర్కీన్‌పై మెరవబోతున్నారు. 2016లో మోహన్‌లాల్ కథానాయకుడిగా ప్రియదర్శన్ తెరెక్కించిన మలయాళ చిత్రం ‘ఒప్పం’. ఇప్పుడు ఇదే చిత్రాన్ని...
పద్దెనిమిది ఏళ్ల తర్వాత అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ కలసి బాలీవుడ్ స్ర్కీన్‌పై మెరవబోతున్నారు. 2016లో మోహన్‌లాల్ కథానాయకుడిగా ప్రియదర్శన్ తెరెక్కించిన మలయాళ చిత్రం ‘ఒప్పం’. ఇప్పుడు ఇదే చిత్రాన్ని అక్షయ్, సైఫ్ ప్రధాన పాత్రలుగా ప్రియదర్శన్ హిందీలో రిమేక్ చేస్తున్నారు. ఈ కథ గురించి చెప్పగానే అక్షయ్ కుమార్ వెంటనే ఒకే చేశారట. అటు సైఫ్ అలీఖాన్ కూడా ప్రియదర్శన్ మూవీలో అవకాశం రావడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. థ్రిల్లర్ కథాంశాంతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో సైఫ్ గుడ్డివాని పాత్రలో కనిపించనున్నారు. ఆగస్టులో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని సైఫ్ బాలీవుడ్ మీడియాతో చెప్పారు. కాగా, గతంలో అక్షయ్ కుమార్ హీరోగా ప్రియదర్శన్ తెరకెక్కించిన హెరాపెరి, హంగామా, గరమ్ మసాలా, భూల్ భులయ్య చిత్రాలు బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాయి. ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో ‘భూత్ బంగ్లా’ అనే హారర్ కామెడీ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే అక్షయ్ కుమార్- ప్రియదర్శన్ కాంబినేషన్‌లో మరో ప్రాజెక్టు ఖరారు కావడం విశేషం.