మంచి నటిగా గుర్తుండిపోవాలి

ABN, Publish Date - May 22 , 2025 | 05:57 AM

‘మళ్లీరావా’ ఫేమ్‌ ఆకాంక్ష సింగ్‌ నటించిన చిత్రం ‘షష్ఠి పూర్తి’. డా.రాజేంద్రప్రసాద్‌, అర్చన, రూపేశ్‌ ప్రధాన పాత్రల్లో పవన్‌ ప్రభ తెరకెక్కించారు. రూపేశ్‌ నిర్మించారు. ఈ నెల 30న...

‘మళ్లీరావా’ ఫేమ్‌ ఆకాంక్ష సింగ్‌ నటించిన చిత్రం ‘షష్ఠి పూర్తి’. డా.రాజేంద్రప్రసాద్‌, అర్చన, రూపేశ్‌ ప్రధాన పాత్రల్లో పవన్‌ ప్రభ తెరకెక్కించారు. రూపేశ్‌ నిర్మించారు. ఈ నెల 30న సినిమా విడుదలవుతున్న సందర్భంగా మీడియాతో ముచ్చటించారు ఆకాంక్ష. ‘‘తెలుగులో చాలా గ్యాప్‌ తర్వాత చేస్తున్న చిత్రమిది. ఇందులో జానకి అనే గ్రామీణ అమ్మాయి పాత్రలో కనిపిస్తాను. నా పాత్రలో ఎన్నో షేడ్స్‌ ఉంటాయి. అద్భుతమైన కథతో పాటు ఉన్నతమైన సాంకేతిక విలువలు ఉన్న చిత్రమిది. ఈ చిత్ర ప్రయాణం ఓ మరిచిపోలేని అనుభూతి. సినిమా కేవలం షష్ఠిపూర్తి గురించే కాకుండా అన్ని రకాల అంశాలనూ టచ్‌ చేస్తుంది. దర్శకుడు పవన్‌కు అద్భుతమైన విజన్‌తో పాటు మంచి క్లారిటీ ఉంటుంది. రాజేంద్రప్రసాద్‌గారు గొప్ప నటుడు. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. నన్ను ఓ మంచి నటిగానే ప్రేక్షకులు గుర్తుపెట్టుకోవాలనేది నా కోరిక. అందుకు తగ్గట్లుగానే మంచి కథల్ని, గుర్తుండిపోయే పాత్రల్నీ ఎంపిక చేసుకుంటాను. ఇళయరాజాగారి సంగీతం ప్రధానాకర్షణ. తల్లిదండ్రుల గురించి గొప్ప సందేశమిచ్చే ఈ చిత్రాన్ని అందరూ చూడాలి’’ అని చెప్పారు.

Updated Date - May 22 , 2025 | 05:57 AM