Ajay Devgn : నిర్మాతగా ఝలక్‌

ABN , Publish Date - Jan 11 , 2025 | 02:41 AM

వరుస సినిమాలతో జోరుమీదున్నాడు బాలీవుడ్‌ హీరో అజయ్‌ దేవ్‌గణ్‌. హీరోగా సినిమాలు చేస్తూనే తన సొంత బేనర్‌ దేవ్‌గణ్‌ ఫిల్మ్స్‌ బేనర్‌పై సినిమాలు నిర్మిస్తున్నారు.

వరుస సినిమాలతో జోరుమీదున్నాడు బాలీవుడ్‌ హీరో అజయ్‌ దేవ్‌గణ్‌. హీరోగా సినిమాలు చేస్తూనే తన సొంత బేనర్‌ దేవ్‌గణ్‌ ఫిల్మ్స్‌ బేనర్‌పై సినిమాలు నిర్మిస్తున్నారు. తాజాగా పనోరమా స్టూడియో్‌సతో కలసి ఆయన ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాకు ‘ఝలక్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. హారర్‌ కామెడీ జానర్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అజయ్‌ దేవ్‌గణ్‌ మేనల్లుడు అమన్‌ దేవ్‌గణ్‌ హీరోగా నటిస్తున్నాడు. అజయ్‌ దేవ్‌గణ్‌ హీరోగా నటించిన ‘ఆజాద్‌’ చిత్రంలో అమన్‌ ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం ఈనెల 26న విడుదలవనుంది. ‘మా హృదయాలకు దగ్గరైన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ప్రేక్షకులను భయపెడుతూనే హాస్యం పంచే కొత్త తరహా కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం’ అని నిర్మాణ సంస్థ తెలిపింది. సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.

Updated Date - Jan 11 , 2025 | 02:41 AM