Hero Jiva : మూడేళ్ల కష్టం ఫలించింది
ABN , Publish Date - Mar 01 , 2025 | 03:29 AM
‘వీఎఫ్ఎక్స్ సీజీ వర్క్స్‌కు ప్రాధాన్యమున్న చిత్రం కావడంతో గత మూడేళ్లుగా ‘అగత్యా’ చిత్రం కోసం కష్టపడుతున్నాను.
- జీవా
‘వీఎఫ్ఎక్స్ సీజీ వర్క్స్‌కు ప్రాధాన్యమున్న చిత్రం కావడంతో గత మూడేళ్లుగా ‘అగత్యా’ చిత్రం కోసం కష్టపడుతున్నాను. ఇప్పుడు ప్రేక్షకులు మా చిత్రాన్ని అమితంగా ఆదరిస్తున్నందుకు ఆనందంగా ఉంది’ అని హీరో జీవా అన్నారు. ఆయన కథానాయకుడిగా పా. విజయ్ దర్శకత్వం వహించిన చిత్రమిది. అర్జున్, సర్జా, రాశిఖన్నా కీలకపాత్రలు పోషించారు. శుక్రవారం ఈ చిత్రం విడుదలను పురస్కరించుకొని జీవా మీడియాతో మాట్లాడుతూ ‘దర్శకుడు గొప్ప స్ర్కిప్ట్‌తో అద్భుతమైన సినిమా ఇచ్చారు. చాలా కొత్త టెక్నాలజీని వాడాం. ఇంటర్నేషనల్ టెక్నికల్ టీమ్‌తో పనిచేశాం. హీరోగా మంచి సినిమా చేశాననే తృప్తినిచ్చింది’ అని చెప్పారు.