నా కల నెరవేరింది
ABN , Publish Date - May 14 , 2025 | 05:46 AM
‘తెలుగు సినిమాల్లో నటించాలనే నా కల ‘భైరవం’తో నెరవేరింది. ఇందులో బోల్డ్ అండ్ హానెస్ట్ క్యారెక్టర్ చేశాను. సినిమా తప్పకుండా అందరినీ అలరిస్తుంది’ అని అన్నారు కథానాయిక అదితి శంకర్. విజయ్ కనకమేడల దర్శకత్వంలో...
‘తెలుగు సినిమాల్లో నటించాలనే నా కల ‘భైరవం’తో నెరవేరింది. ఇందులో బోల్డ్ అండ్ హానెస్ట్ క్యారెక్టర్ చేశాను. సినిమా తప్పకుండా అందరినీ అలరిస్తుంది’ అని అన్నారు కథానాయిక అదితి శంకర్. విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఆమె నటించిన చిత్రం ‘భైరవం’. కె.కె.రాధామోహన్ నిర్మాత. ఈనెల 30న సినిమా విడుదలవుతున్న సందర్భంగా మీడియాతో ముచ్చటించారు. ‘నేను తమిళంలో చేసిన తొలి సినిమాను డైరెక్టర్ విజయ్ చూశారు. ‘భైరవం’లో క్యారెక్టర్‌కు సరిపోతానని భావించి కాల్ చేసి ఈ ప్రాజెక్టు గురించి చెప్పారు. ఇందులో నేను పోషిస్తున్న పాత్ర నా ఒరిజినల్ క్యారెక్టర్‌కి దగ్గరగా ఉంటుంది. ఇంత మంచి సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందంగా ఉంది. మంచు మనోజ్, సాయి శ్రీనివాస్, నారా రోహిత్ ముగ్గురికీ తమిళ్ మాట్లాడడం వచ్చు. అందువల్ల వారితో నా జర్నీ చాలా సౌకర్యవంతంగా సాగింది. శ్రీచరణ్ అద్భుతమైన సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. త్వరలో మరో పాట కూడా రాబోతుంది. ఆర్టిస్టుల నుంచి ఎలాంటి నటనను రాబట్టుకోవాలో డైరెక్టర్ విజయ్ కనకమేడలకి బాగా తెలుసు. ఆయన విజన్ ఉన్న దర్శకుడు. హిస్టారికల్, పీరియాడిక్ సినిమాలు చేయాలనేది నా కోరిక’ అని అన్నారు.