ఆగస్టు 29న విశాల్ సాయి ధన్షిక వివాహం
ABN , Publish Date - May 20 , 2025 | 04:37 AM
కోలీవుడ్‌లోని మోస్ట్ బ్యాచిలర్ హీరోల్లో ఒకరైన విశాల్ త్వరలోనే ఓ ఇంటివారు కాబోతున్నారు. హీరోయిన్ సాయి ధన్షికను ఆయన పెళ్ళి చేసుకోనున్నారు. సాయి ధన్షిక ప్రధాన పాత్రను...
కోలీవుడ్‌లోని మోస్ట్ బ్యాచిలర్ హీరోల్లో ఒకరైన విశాల్ త్వరలోనే ఓ ఇంటివారు కాబోతున్నారు. హీరోయిన్ సాయి ధన్షికను ఆయన పెళ్ళి చేసుకోనున్నారు. సాయి ధన్షిక ప్రధాన పాత్రను పోషించిన ‘యోగి దా’ చిత్ర మూవీ ఆడియో రిలీజ్ వేడుక సోమవారం రాత్రి చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమానికి హీరో విశాల్ అతిథిగా హాజరయ్యారు. ఇందులో తమ పెళ్ళి విషయాన్ని వారు అధికారికంగా వెల్లడించారు. ఆగస్టు 29వ తేదీన వివాహం చేసుకోబోతున్నట్టు వారు వేదికపై నుంచి వెల్లడించారు. కాగా, నడిగర్ సంఘం భవన నిర్మాణం పూర్తయిన తర్వాత వీరిద్దరూ పెళ్ళి పీటలెక్కనున్నారనే వార్తలు జోరుగా వినిపించాయి. ఈ నేపథ్యంలో వారు తమ పెళ్ళి వార్తను ముందుగానే ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు.
చెన్నై (ఆంధ్రజ్యోతి)