నటుడు భరత్‌కు మాతృవియోగం
ABN , Publish Date - May 20 , 2025 | 04:34 AM
నటుడు బి.భరత్ (మాస్టర్ భరత్) ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి బి.కమలహాసిని (53) గుండెపోటుతో చెన్నై, తేనాంపేటలోని స్వగృహంలో మృతి చెందారు. ఆదివారం మధ్యాహ్నం సమయంలో...
గుండెపోటుతో తల్లి మృతి
నటుడు బి.భరత్ (మాస్టర్ భరత్) ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి బి.కమలహాసిని (53) గుండెపోటుతో చెన్నై, తేనాంపేటలోని స్వగృహంలో మృతి చెందారు. ఆదివారం మధ్యాహ్నం సమయంలో భోజనం చేసిన తర్వాత టీవీ ఆన్ చేసేందుకు ప్రయత్నించగా ఆమెకు గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయి తుదిశ్వాస విడిచినట్టు నటుడు భరత్ మేనేజర్ ప్రకాశ్ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ఆమె అంత్యక్రియలు తేనాంపేటలోని శ్మశానవాటికలో సోమవారం పూర్తి చేశారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు, సన్నిహితులు ఆయనకు ఫోన్ చేసి ధైర్యం చెబుతున్నారు. బాల నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న భరత్... ప్రస్తుతం పలు చిత్రాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్న విషయం తెల్సిందే.
చెన్నై (ఆంధ్రజ్యోతి)