నెలకు రూ 40 లక్షలు కావాలి
ABN, Publish Date - May 22 , 2025 | 06:03 AM
సినీ హీరో రవి మోహన్ నుంచి జీవనాంశం కోరుతూ ఆయన భార్య ఆర్తి రవి చెన్నై ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విడాకులు కోరుతున్న భర్త నుంచి నెలకు రూ.40 లక్షలు...
ఫ్యామిలీ కోర్టులో రవి మోహన్ భార్య ఆర్తి పిటీషన్
సినీ హీరో రవి మోహన్ నుంచి జీవనాంశం కోరుతూ ఆయన భార్య ఆర్తి రవి చెన్నై ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విడాకులు కోరుతున్న భర్త నుంచి నెలకు రూ.40 లక్షలు ఇప్పించాలని ఆమె ఆ పిటిషన్‌లో కోరారు. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని రవి మోహన్ న్యాయవాదులను ఆదేశిస్తూ తదుపరి విచారణను జూన్ 12వ తేదీకి వాయిదా వేసింది. విచారణ సందర్భంగా ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చినా ఫలితం లేకపోయింది. తన భర్త నుంచి నెలకు రూ.40 లక్షల భరణం కావాలని ఆర్తి ఈ సందర్భంగా కోరారు.
చెన్నై (ఆంధ్రజ్యోతి)