Shambhala: న్యూ ఇయర్ స్పెషల్.. ‘శంబాల’ ఆసక్తికర పోస్టర్

ABN , Publish Date - Jan 01 , 2025 | 06:40 PM

యంగ్ ప్రామిసింగ్ హీరో ఆది సాయికుమార్ నటిస్తోన్న సూపర్ న్యాచురల్ హారర్ థ్రిల్లర్ చిత్రం ‘శంబాల’. ఈ చిత్రం నుండి న్యూ ఇయర్ స్పెషల్‌గా ఓ అదిరిపోయే పోస్టర్‌ని వదిలారు. ఈ పోస్టర్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేదిగా ఉంది. వివరాల్లోకి వెళితే..

Shambhala Movie Poster

సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా విభిన్న చిత్రాలతో ప్రయోగాలు చేస్తూ ప్రతి చిత్రంతో ఆడియెన్స్‌కు సరికొత్త అనుభూతిని ఇస్తున్న హీరో ఆది సాయి కుమార్ ప్రస్తుతం ‘శంబాల’ అంటూ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ‘శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్‌’ అంటూ రాబోతోన్న ఈ చిత్రానికి ‘A’ (యాడ్ ఇన్ఫినిటమ్) ఫేమ్ యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్నారు. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఆది సాయి కుమార్ సరసన అర్చన అయ్యర్ నటిస్తోంది. న్యూ ఇయర్ స్పెషల్‌గా మేకర్స్ ఓ అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు.


Also Read-కాశీ యాత్రలో రేణు దేశాయ్, అకీరా, ఆద్య.. సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్

ఇంతకు ముందు ఆది సాయి కుమార్ బర్త్‌డే స్పెషల్‌గా వదిలిన పోస్టర్ అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఆది సాయి కుమార్ ఇంటెన్స్ లుక్, వింటేజ్ మేకోవర్‌కు మంచి స్పందన వచ్చింది. ఇక న్యూ ఇయర్ స్పెషల్‌గా వదిలిన కొత్త పోస్టర్ ‘శంబాల’ మీద మరింతగా ఆసక్తిని పెంచేస్తోంది. ఈ పోస్టర్‌లో చూపించిన ఆ పొలం.. ఆ దిష్టి బొమ్మ.. ఆకాశం నుంచి భూమ్మీదకు వస్తున్న అగ్ని కణం ఇలా అన్నీ కూడా కథ మీద అంచనాలు పెంచేలా ఉన్నాయి. ఈ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.


Aadi-Saikumar-Shambhala.jpg

ఆది సాయి కుమార్, అర్చన అయ్యర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సూర్య45లో కీలక పాత్ర పోషిస్తోన్న ‘లబ్బర్ పందు’ ఫేమ్ స్వాసిక ఇంపార్టెంట్ క్యారెక్టర్‌ను పోషిస్తున్నారు. రవివర్మ, మీసాల లక్ష్మణ్, మధునందన్ వంటి ప్రముఖ నటులు ముఖ్య పాత్రలు పోషిస్తోన్న ఈ చిత్రానికి హన్స్ జిమ్మర్ వంటి హాలీవుడ్ వ్యక్తులతో కలిసి పనిచేసిన ప్రతిభావంతులైన మ్యూజిక్ డైరెక్టర్ శ్రీరామ్ మద్దూరి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఆర్‌ఎఫ్‌సిలో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోందీ చిత్రం.


Also Read-Prabhas: తెలంగాణ ప్రభుత్వానికి రెబల్ స్టార్ ప్రభాస్ సపోర్ట్

Also Read-Dil Raju: సీఎంతో సినీ ప్రముఖుల భేటీపై కేటీఆర్ కామెంట్స్‌కు దిల్ రాజు స్పందనిదే..

Aslo Read-Game Changer: డిప్యూటీ సీఎం డేట్ ఇస్తే.. హిస్టరీ రిపీట్ అవుద్ది..

Also Read-Yearender 2024 ఆర్టికల్స్..

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 01 , 2025 | 06:40 PM