రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్
ABN , Publish Date - May 16 , 2025 | 04:09 AM
హాస్యం, రొమాన్స్, ఎమోషన్స్ అంశాలతో రూపుదిద్దుకున్న చిత్రం ‘వర్జిన్ బాయ్స్’. యువతీయువకుల మధ్య ప్రస్తుతం ఉన్న రిలేషన్‌షిప్స్ గురించి వివరిస్తూ...
హాస్యం, రొమాన్స్, ఎమోషన్స్ అంశాలతో రూపుదిద్దుకున్న చిత్రం ‘వర్జిన్ బాయ్స్’. యువతీయువకుల మధ్య ప్రస్తుతం ఉన్న రిలేషన్‌షిప్స్ గురించి వివరిస్తూ దయానంద్ దర్శకత్వంలో రాజా దరపునేని నిర్మించారు. గీతానంద్, మిత్రా శర్మ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం టీజర్ విడుదలైంది. యూత్‌ఫుల్ వైబ్స్, కలర్‌ఫుల్ విజువల్స్‌తో టీజర్ ఆకట్టుకుంటోంది. చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ ‘యూత్‌కి కనెక్ట్ అయ్యేలా చిత్రాన్ని తీశాం. ఇంతకుముందు ఎన్నో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్స్ వచ్చినా వాటిని మైమరిపించేలా సినిమా ఉంటుంది. ఈ సమ్మర్‌కు కచ్చితమైన సినిమా’ అన్నారు. శ్రీహాన్, రోనిత్, జెన్నిఫర్, అన్షుల, సుజిత్‌కుమార్, అభిలాష్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.