భయానక అనుభవాల కథ
ABN , Publish Date - Mar 10 , 2025 | 04:33 AM
యదార్థ సంఘటనల ఆధారంగా సైకలాజికల్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన చిత్రం ‘శారీ’. ఆర్జీవీ - ఆర్వి ప్రొడక్షన్స్ బేనర్‌పై గిరి కృష్ణ కమల్ దర్శకత్వంలో రవిశంకర్ వర్మ నిర్మించారు...
యదార్థ సంఘటనల ఆధారంగా సైకలాజికల్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన చిత్రం ‘శారీ’. ఆర్జీవీ - ఆర్వి ప్రొడక్షన్స్ బేనర్‌పై గిరి కృష్ణ కమల్ దర్శకత్వంలో రవిశంకర్ వర్మ నిర్మించారు. సత్య యాదు, ఆరాధ్యదేవి జంటగా నటించారు. ఈ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. పలు భారతీయ భాషల్లో ఈ నెల 21న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఆదివారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ ‘సోషల్ మీడియా ప్రభావం వల్ల యువత ఎదుర్కొన్న భయానక అనుభవాల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం’ అన్నారు. ఓ మంచి సినిమాతో నిర్మాతగా పరిచయమవుతున్నందుకు ఆనందంగా ఉందని రవిశంకర్ చెప్పారు.