Barbaric : యాక్షన్ హీరోగా పేరు తెస్తుంది
ABN , Publish Date - Jan 04 , 2025 | 05:43 AM
దర్శకుడు మారుతి సమర్పకుడిగా రూపొందుతున్న చిత్రం ‘బార్బరిక్’. మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో విజయపాల్ రెడ్డి నిర్మిస్తున్నారు. సత్యరాజ్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్,
దర్శకుడు మారుతి సమర్పకుడిగా రూపొందుతున్న చిత్రం ‘బార్బరిక్’. మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో విజయపాల్ రెడ్డి నిర్మిస్తున్నారు. సత్యరాజ్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, సత్యం రాజేశ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రం టీజర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో మారుతి మాట్లాడుతూ ‘ఈ సినిమా కోసం సలహాలు, సూచనలు ఇవ్వడం తప్ప నేనే మరేమీ చేయలేదు. ఇది రిస్కీ జానర్ అని మాత్రం చెప్పా. విజయ్ ఈ సినిమా కోసం చాలా ఖర్చు పెట్టారు. చిత్రం చాలా కొత్తగా ఉంటుంది. పెద్ద హిట్ అవుతుంది’ అన్నారు.
‘ఈ సినిమాకు కథే హీరో. ఇందులో నా పాత్ర కొత్తగా ఉంటుంది. ఏజ్డ్ యాక్షన్ హీరో అనే ట్యాగ్ కోసం ప్రయత్నిస్తున్న నాకా ఆ ట్యాగ్ ఈ సినిమాతో వస్తుంది. తెలుగులో నేనే డబ్బింగ్ చెప్పా’ అన్నారు సత్యరాజ్. దర్శకుడు మారుతితో కలసి ఈ సినిమా చేస్తున్నందుకు ఆనందంగా ఉందని నిర్మాత విజయపాల్ చెప్పారు. ఇంత పెద్ద సినిమా చేస్తానని అనుకోలేదనీ, చిత్రం అద్భుతంగా ఉంటుందని దర్శకుడు మోహన్ చెప్పారు.