మ్యూజికల్ ఎంటర్‌టైనర్
ABN , Publish Date - Mar 05 , 2025 | 06:26 AM
వైవిధ్యమైన ఇతవృత్తంతో రూపుదిద్దుకున్న చిత్రం ‘టుక్ టుక్’. హర్ష రోషన్, కార్తికేయ దేవ్, నిహాల్ కోదాటి ముఖ్య పాత్రలు పోషించారు...
వైవిధ్యమైన ఇతవృత్తంతో రూపుదిద్దుకున్న చిత్రం ‘టుక్ టుక్’. హర్ష రోషన్, కార్తికేయ దేవ్, నిహాల్ కోదాటి ముఖ్య పాత్రలు పోషించారు. ఈ నెల 21న విడుదల కానుంది. సుప్రీత్ కృష్ణ దర్శకుడు. రాహుల్ రెడ్డి, లోక్కు శ్రీ వరుణ్, శ్రీరాములు రెడ్డి, సుప్రీత్ కృష్ణ నిర్మాతలు. మంగళవారం టీజర్‌ను విడుదల చేశారు. శాన్వీ మేఘన మాట్లాడుతూ ‘సినిమా ఎంజాయ్ చేసేలా ఉంటుంది. థియేటర్‌కి వచ్చి చూడండి’ అని కోరారు. ‘ముగ్గురు యువకుల ప్రయాణం ఇది. అనుకోని అవాంతరాలను వారు ఎలా అధిగమించారనేది ఆసక్తికరం’ అన్నారు రోషన్. దర్శకుడు మాట్లాడుతూ ‘ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్. త్వరలో ఓ బిగ్గెస్ట్ సర్‌ప్రైజ్ రాబోతోంది’ అని చెప్పారు.