అనగనగా ఓ ప్రేమకథ
ABN , Publish Date - Mar 16 , 2025 | 05:21 AM
నూతన తారాగణంతో ఆస్ట్రేలియా గడ్డపై తెరకెక్కిన ప్రేమకథా చిత్రం ‘అనగనగా ఆస్ట్రేలియాలో’....
నూతన తారాగణంతో ఆస్ట్రేలియా గడ్డపై తెరకెక్కిన ప్రేమకథా చిత్రం ‘అనగనగా ఆస్ట్రేలియాలో’. తారకరామ దర్శకత్వంలో బీటీఆర్ శ్రీనివాసరావు నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకొస్తోంది. తాజాగా చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. తారకరామ మాట్లాడుతూ ‘మెల్‌బోర్న్‌లో చిత్రీకరణ అంత సులువు కాదు, ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి సినిమాను పూర్తి చేశాం’ అన్నారు.