ప్రతీ కుటుంబం కనెక్ట్ అయ్యే చిత్రం
ABN, Publish Date - Feb 18 , 2025 | 01:09 AM
కామెడీ నటుడు ధనరాజ్ కథానాయకుడిగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ద్విభాషా చిత్రం ‘రామం రాఘవం’. ‘అల వైకుంఠపురం’, ‘పుష్ప’ చిత్రాలతో తెలుగువారికి చేరువైన నటుడు సముద్రఖని...
కామెడీ నటుడు ధనరాజ్ కథానాయకుడిగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ద్విభాషా చిత్రం ‘రామం రాఘవం’. ‘అల వైకుంఠపురం’, ‘పుష్ప’ చిత్రాలతో తెలుగువారికి చేరువైన నటుడు సముద్రఖని కీలక పాత్రలో నటించారు. ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పోలవరపు నిర్మించారు. ఈ నెల 21న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. హీరో ధనరాజ్ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తుంది. ప్రతీ కుటుంబానికి కనెక్ట్ అయ్యే కథాంశమిది’’ అని చెప్పారు. నటుడు సముద్రఖని మాట్లాడుతూ ‘‘ఇది నాకు చాలా బాగా నచ్చిన కథ. సినిమా విజయంపై నమ్మకముంది. దర్శకుడు చాలా జెన్యూన్‌గా ఈ కథను రాయడంతో పాటు అంతే నిజాయితీగా సినిమాను తెరకెక్కించారు’’ అని చెప్పారు. చిత్ర నిర్మాత పృథ్వి మాట్లాడుతూ ‘‘ఈ సినిమా ఒక అద్భుతమైన ఎమోషనల్ జర్నీ. ఈ సినిమాతో ధనరాజ్ మరో స్థాయికి చేరుకుంటారు’’ అని తెలిపారు.
ఇవీ చదవండి:
ప్రాక్టీస్ మొదలుపెట్టిన క్రికెట్ గాడ్.. ఫ్యాన్స్‌కు పండగే
రోహిత్ తిరుగులేని వ్యూహం.. పక్కా స్కెచ్‌తో
ధోని నుంచి రోహిత్ ఎరా వరకు.. డాక్యుమెంటరీ చూశారా..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి