థ్రిల్లింగ్‌ అంశాలతో...

ABN , Publish Date - Mar 25 , 2025 | 02:06 AM

నవీన్‌ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా నటించిన చిత్రం ‘28 డిగ్రీల సెల్సియస్‌’. ‘పొలిమేర’ ఫేమ్‌ డా.అనిల్‌ విశ్వనాథ్‌ తెరకెక్కించారు. సాయి అభిషేక్‌ నిర్మించిన ఈ చిత్రం...

నవీన్‌ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా నటించిన చిత్రం ‘28 డిగ్రీల సెల్సియస్‌’. ‘పొలిమేర’ ఫేమ్‌ డా.అనిల్‌ విశ్వనాథ్‌ తెరకెక్కించారు. సాయి అభిషేక్‌ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 4న విడుదలవుతోంది. తాజాగా, సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు డా.అనిల్‌ విశ్వనాథ్‌ మాట్లాడుతూ ‘‘ఇదో అందమైన ప్రేమకథ. థ్రిల్లింగ్‌ అంశాలు పుష్కలంగా ఉంటాయి’’ అని చెప్పారు. ‘‘నిజాయితీతో తీసిన చిత్రమిది. ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అని హీరో నవీన్‌ చంద్ర చెప్పారు. ‘‘ఈ సినిమా మా చిత్రబృందానికి ఓ భావోద్వేగ ప్రయాణం’’ అని చిత్రనిర్మాత సాయి అభిషేక్‌ తెలిపారు.

Updated Date - Mar 25 , 2025 | 02:06 AM