Kiara Adwani: కియారా బికినీ సీన్స్ పై కామెంట్స్.. మేకర్స్‌ ఇచ్చిపడేశారు..

ABN , Publish Date - Aug 07 , 2025 | 03:28 PM

కియారా అద్వానీ  బికినీ ఫుటేజ్‌ ఓ రేంజ్‌లో నెట్టింట చక్కర్లు కొడుతుంది. దానిపై ఆకతాయిలు విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు. బాలీవుడ్‌లో ఏ హీరోయిన్‌ బికినీలో ఇంత అందంగా కనిపించలేదంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

Kiara adwani - War 2


హీరోయిన్‌ కియారా అడ్వాణీ (Kiara adwani) ఇటీవ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఆమె మాతృత్వాన్ని ఆస్వాదిస్తూ ఇంట్లో తన బిడ్డతో గడుపుతోంది. ప్రస్తుతం ఆమె నటించిన వార్‌-2 చిత్రం విడుదల సిద్ధమైంది. హృతిక్‌ రోషన్‌కు (Hrithik Roshan) జోడీగా నటించిన ఈ చిత్రానికి అయాన్‌ ముఖర్జీ దర్శకుడు. తారక్‌ కీలక పాత్రలో కనిపిస్తారు. నెలక్రితం వరకూ గర్భంతో ఉండటం, ఇప్పుడు బిడ్డకు జన్మనిచ్చి ఇంట్లో ఉండటతో ఈ సినిమా ప్రమోషన్స్‌కు ఆమె హాజరు కావడం లేదు. కానీ కియారాకు సంబంధించిన కంటెంట్‌ మాత్రం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ముఖ్యంగా ఆమె బికినీ (Kiara bikini) ఫుటేజ్‌ ఓ రేంజ్‌లో నెట్టింట చక్కర్లు కొడుతుంది. దానిపై ఆకతాయిలు విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు. బాలీవుడ్‌లో ఏ హీరోయిన్‌ బికినీలో ఇంత అందంగా కనిపించలేదంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. బికినీ కియారాకు కొత్తేమీ కాదు.

గతంలో చాలాసార్లు బికినీలో దర్శనమిచ్చింది. అయిఏత వార్‌-2 అంతకుమించి అందాల్ని ఒలకబోసిందని చెబుతున్నారు. కొందరు మాత్రం కియారా బికినీ అందాలకు కంప్యూటర్‌ జనరేటెడ్‌ ఇమేజరీ వర్క్‌ కారణమని చెబుతున్నారు. అది ఒరిజినల్‌ కాదునీ,  సీజీఐతో చేశారని రూమర్స్‌ క్రియేట్‌ చేశారు. దీంతో నెగటివ్‌ ప్రచారం మొదలవ్వగా.. వార్‌-2 మేకర్స్‌  రియాక్ట్‌ అయ్యారు. కామెంట్స్‌ చేస్తూ, రూమార్స్‌ పాస్‌ చేసినవాళ్లకి గట్టి కౌంటర్‌ ఇచ్చారు. దీనికి చెక్‌ పెడుతూ బిహైండ్‌ ది సీన్స్‌ వీడియో రిలీజ్‌ చేశారు.  దాని ద్వారా బికినీ షాట్స్‌ నిజంగా తీసినవని మేకర్స్‌ స్పష్టం చేశారు. వీడియోలో కియారా బికినీ షాట్‌ కోసం ఎలా తయారయ్యారో చూపించారు. బికినీలో స్విమ్మింగ్‌ ప్రాక్టీస్‌తోపాటు ఆ షాట్‌కు సంబంధించిన విజువల్స్‌ కూడా జత చేశారు. అలా అది సీజీఐ వర్క్‌ కాదని సూటిగా సమాధానం ఇచ్చారు. దీంతో ఈ సీన్‌ కోసం కియారా ఎంత కష్టపడిందో క్లియర్‌గా ఈ వీడియోలో తెలుస్తోంది.   

Updated Date - Aug 07 , 2025 | 03:38 PM