Vikrant Massey: కష్టానికి తగ్గ ఫలితం

ABN , Publish Date - Aug 02 , 2025 | 06:25 AM

ధూమ్‌ మచావో ధూమ్‌ షోతో బుల్లి తెరపై తన నట ప్రస్థానాన్ని ప్రారంభించారు విక్రాంత్‌ మాస్సే. 2009లో బాలికా వధు

‘ధూమ్‌ మచావో ధూమ్‌’ షోతో బుల్లి తెరపై తన నట ప్రస్థానాన్ని ప్రారంభించారు విక్రాంత్‌ మాస్సే. 2009లో ‘బాలికా వధు’ టీవీ షో ద్వారా పాపులర్‌ అయ్యారు. 2013లో ‘లుటేరా’ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు. ‘జిన్నీ వెడ్స్‌ సన్నీ’, ‘హసీన్‌ దిల్‌ రూబా’, ‘లవ్‌ హాస్టల్‌’, ‘ట్వెల్త్‌ ఫెయిల్‌’, ‘సెక్టార్‌ 36’, ‘సబర్మతీ ఎక్స్‌ప్రెస్‌’ చిత్రాలతో మంచి పేరు గడించారు. ‘12 ఫెయిల్‌’ చిత్రంలో సహజంగా నటించేందుకు విక్రాంత్‌ పడిన కష్టం అంతా ఇంతా కాదు. సినిమాలో నల్లగా కనిపించాలని దర్శకుడు వినోద్‌ చోప్రా చెప్పడంతో శరీరానికి ఆవనూనె పట్టించి రోజూ మూడు గంటల పాటు ఎండలో గడిపారు విక్రాంత్‌. దీని వల్ల స్కిన్‌ ఇన్‌ఫెక్షన్‌ వచ్చినా ఆయన లెక్క చేయలేదు. ఆ కష్టానికి ఫలితం ఇప్పుడు జాతీయ అవార్డ్‌ రూపంలో దక్కింది.

Updated Date - Aug 02 , 2025 | 06:25 AM