Vidya Balan: మళ్లీ థియేటర్లలోకి 'పరిణీత'

ABN , Publish Date - Aug 12 , 2025 | 05:31 PM

కళ్ళతోనే మత్తెక్కించగల అందం విద్యాబాలన్ సొంతం. కెరీర్ ప్రారంభం నుంచి కంటెంట్ సినిమాలతోనే మెస్మరైజ్ చేస్తోంది. అంతేకాక బోల్డ్ గా అందాలు ఆరబోసి కుర్రకారుకు నిద్ర లేకుండా చేసింది. ఈ బ్యూటీ కెరీర్ లోని మైల్ స్టోన్ మూవీ మరోసారి మాయ చేయడానికి జనం ముందుకు రాబోతోంది.

Vidya Balan - Parineetha

బాలీవుడ్ అందం విద్యాబాలన్ (Vidya Balan) గురించి తెలియని వారుండరు. హోమ్లీగా కనిపిస్తూనే గ్లామర్ ట్రీట్ తో రచ్చచేస్తుంటుంది. ఒళ్ళు ఏ మాత్రం దాచుకోకుండా అందాల విందు వడ్డిస్తుంటుంది. ఇంటిమెసీ సీన్లలో తనకు దీటుగా ఎవ్వరూ చేయలేరని ప్రూవ్ చేసుకుందీ చిన్నది. బిగ్ స్టార్స్ సరసన నటిస్తూనే పలు లేడీ ఓరియంటెడ్ మూవీస్ లోనూ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. 'డర్టీ పిక్చర్' ( Dirty Picture) తో ఓ రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకుంది విద్యాబాలన్. ప్రెజెంట్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఆమె నటించిన ఐకానిక్ మూవీ మళ్లీ సందడి చేయడానికి సిద్థం అవుతోంది.

విద్యాబాలన్, సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) , సంజయ్ దత్ (Sanjay Dutt) లీడ్ రోల్స్ లో ప్రదీప్ సర్కార్ (Pradeep Sarkar ) తెరకెక్కించిన 'పరిణీత' (Parineeta) చిత్రం 2005 జూన్ 10న థియేటర్లలో విడుదలైంది. ఇరవై యేళ్ళ క్రితం విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు 8కె వెర్షన్ లో మళ్లీ థియేటర్లలోకి రాబోతోంది. దివంగత ప్రదీప్ సర్కార్ దర్శకత్వం వహించి.. వినోద్ చోప్రా ఫిల్మ్స్ ( Vinod Chopra Filems ) ప్రొడ్యూస్ చేసిన ఈ చిత్రం ఆగస్ట్ 29న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అంతేకాక ఈ మూవీ విద్యాబాలన్ కెరీర్‌లో 20 ఏళ్లు, వినోద్ చోప్రా ఫిల్మ్స్ కెరీర్‌లో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సినిమాగా నిలవడం విశేషం. ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్స్ దీనిని 8K వెర్షన్‌లో రీ క్రియేట్ చేసింది. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది.

విద్యా బాలన్ తొలుత 2003లో 'భలో తేకో' అనే బెంగాలీ సినిమాతో ఫిలిం ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. 2005 లో ఆమె చేసిన హిందీ మూవీ 'పరిణీత'తో బాలీవుడ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. తొలి చిత్రంతోనే విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాగాను బెస్ట్ ఫీమేల్ డెబ్యూ కేటగిరీలో ఫిలింఫేర్ అవార్డ్ ను సొంతం చేసుకుంది. ఈ మూవీ తర్వాత లీడింగ్ స్టార్ హీరోల సరసన వరుసగా అవకాశాలు అందుకుంది. దాదాపు 20 ఏళ్ల క్రితం వచ్చిన 'పరిణీత' మూవీ రీ-రిలీజ్ కు రెడీ అవ్వడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేసింది. అయితే పీవీఆర్, ఐనాక్స్ సినిమాహాల్స్ లో మాత్రమే ఇది ప్రదర్శించబడుతోంది. అది కూడా ఓ వారం మాత్రమే ప్రదర్శిస్తారు. దీంతో ఈ మూవీని మరోసారి చూసేందుకు మూవీ లవర్స్ ఆసక్తి చూపుతున్నారు.

Updated Date - Aug 12 , 2025 | 05:31 PM