Sandhya Shantaram: అలనాటి నటి, శాంతారామ్‌ సతీమణి సంధ్య కన్నుమూత

ABN , Publish Date - Oct 05 , 2025 | 06:30 AM

ప్రఖ్యాత దర్శకుడు వి.శాంతారామ్‌ సతీమణి, అలనాటి ప్రముఖ నటి సంధ్య (94) వృద్ధాప్య సమస్యలతో మరణించారు.

Sandhya Shantaram

ప్రఖ్యాత దర్శకుడు వి.శాంతారామ్‌ సతీమణి, అలనాటి ప్రముఖ నటి సంధ్య (94) వృద్ధాప్య సమస్యలతో మరణించారు. శాంతారామ్‌కు సంధ్య మూడో భార్య. నాలుగేళ్లుగా అనారోగ్యంతో బాధ పడుతోన్న ఆమె శుక్రవారం రాత్రి ముంబైలోని రాజ్‌కమల్‌ స్టూడియోస్‌లో తుదిశ్వాస విడిచారు.

శనివారం ఉదయం శివాజీ పార్క్‌లో కుటుంబ సభ్యులు ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. 1950, 60లలో పలు హిందీ, మరాఠీ చిత్రాల్లో సంధ్య నటించారు. ‘దో ఆంఖే బారా హాథ్‌’, ‘నవ్‌రంగ్‌’, ‘జనక్‌ జనక్‌ పాయల్‌ బాజే’, ‘పింజ్రా’ సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

Updated Date - Oct 05 , 2025 | 07:00 AM