Sunny Sanskari Ki Tulsi Kumari: జాన్వీక‌పూర్.. మ‌రో కోత్త సినిమా టీజ‌ర్ వ‌చ్చేసింది

ABN , Publish Date - Aug 29 , 2025 | 12:19 PM

వ‌రుణ్ దావ‌న్, జాన్వీక‌పూర్ జంట‌గా బాలీవుడ్‌లో రూపొందిన కొత్త చిత్రం సన్నీ సంస్కారీ కి తులసీ కుమారి.

Janhvi Kapoor

వ‌రుణ్ దావ‌న్ (Varun Dhawan), జాన్వీక‌పూర్ (Janhvi Kapoor), సాన్య మ‌ల్హోత్రా (Sanya Malhotra), రోహిత్ స‌రాఫ్ (Rohit Saraf) జంట‌లుగా బాలీవుడ్‌లో రూపొందిన కొత్త చిత్రం స‌న్నీ సన్‌స్కారి తుల‌సీ కుమారి (Sanskari Ki Tulsi Kumari). ఔట్ అండ్ ఔట్ వినోద ప్రధాన‌త్మ‌కంగా రూపొందిన ఈ చిత్రానికి శ‌శాంక్ ఖైతాన్ (Shashank Khaitan) ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా ధ‌ర్మ ప్రోడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై క‌ర‌ణ్ జోహార్ (Karan Johar) నిర్మించారు.

దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుద‌ల‌కు ముస్తాబ‌యింది. ఈ నేప‌థ్య ంలో మేక‌ర్స్ తాజాగా ఈ మూవీ టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా సినిమాను ద‌స‌రా ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని అక్టోబ‌ర్ 2న సినిమాను థియుట‌ర్ల‌కు తీసుకు వ‌స్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఇక టీజ‌ర్ విష‌యానికి వ‌స్తే.. ఇటీవ‌లే జాన్వీ న‌టించిన ప‌ర‌మ్ సుంద‌రి సినిమాలో మొద‌టి నుంచి చివ‌రి వ‌ర‌కు క‌ట్టుబొట్టుతో అసాంతం చీర‌లో క‌న‌బ‌డి ప‌క్కింటి అమ్మాయిగా మెస్మ‌రైజ్‌చేసిన విష‌యం తెలిసిందే. అయితే.. ఇప్పుడు ఈ సన్‌స్కారి చిత్రానికి వ‌చ్చే స‌రికి జాన్సీ పూర్తి విరుద్ద‌మైన మోడ్ర‌న్ డ్రెస్‌లో ద‌ర్శ‌ణ‌మిచ్చి షాకిచ్చింది. కేవ‌లం 50 సెకండ్లు మాత్ర‌మే ఉన్న ఈ టీజ‌ర్‌ను రిలీజ్ డేట్ ఎనౌన్స్ మెంట్‌కు మాత్ర‌మే ఉప‌యోగించ‌గా మ‌ధ్య‌లో వ‌చ్చిన సింగిల్ లైన‌ర్ పంచ్‌లు ఆక‌ట్టుకునేలా ఉన్నాయి.

Updated Date - Aug 29 , 2025 | 12:19 PM