Vanga sandeep reddy: ఆ హీరోయిన్ రూల్ బ్రేక్ చేసి స్టోరీ లీక్ చేస్తోంది
ABN , Publish Date - Jun 22 , 2025 | 04:34 PM
దర్శకుడు సందీప్‌రెడ్డి (Vanga sandeep reddy) వంగా ఇటీవల ఓ స్టార్ హీరోయిన్‌పై ఫైర్ అయిన సంగతి తెలిసిందే! కొంతకాలంగా ఇది బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.
దర్శకుడు సందీప్‌రెడ్డి (Vanga sandeep reddy) వంగా ఇటీవల ఓ స్టార్ హీరోయిన్‌పై ఫైర్ అయిన సంగతి తెలిసిందే! కొంతకాలంగా ఇది బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే సోషల్‌మీడియా వేదికగా శనివారం ఆయన పెట్టిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాను దర్శకత్వం వహించిన తొలి హిందీ చిత్రం ‘కబీర్ సింగ్’ (Kabir Singh) విడుదలై ఆరేళ్లు అయిన సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. హీరో షాహిద్ కపూర్ లేకుండా కేవలం కియారా అడ్వాణీ (kiara adwani) మాత్రమే ఉన్న పోస్టర్‌ను పంచుకుంటూ సినీ ప్రియులకు ధన్యవాదాలు చెప్పారు. కేవలం కియారా ఫొటోను మాత్రమే షేర్ చేయడం ఇప్పుడు మళ్లీ చర్చకు దారి తీసింది. ఓ స్టార్ హీరోయిన్‌తో వివాదం వేళ కియారాను ప్రశంసించేందుకే ఆయన ఈ విధంగా చేసి ఉంటారని పలువురు భావిస్తున్నారు.
ఇంతకీ జరిగింది ఏంటంటే..
ప్రభాస్ హీరోగా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహించనున్న చిత్రం ‘స్పిరిట్’.ఈ సినిమాలో కథానాయికగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ని తీసుకోవాలని ఆయన ఆలోచించారు. ఈ మేరకు ఒక హీరోయిన్‌తో కథ గురించి చర్చించారు. పని గంటల విషయంలో అభిప్రాయ భేదాలు వచ్చాయి. దాంతో ఆమె ప్రాజెక్ట్‌ను తిరస్కరించినట్లు టాక్. ఈక్రమంలోనే ఆమె పీఆర్ టీమ్ తన స్టోరీని లీక్ చేస్తోందని ఆయన కామెంట్ చేశారు.
‘‘ఇటీవల నేను ఓ అగ్ర కథానాయికకు స్టోరీ చెప్పాను. వందశాతం నమ్మకంతో ఆమెకు వివరించాను. దర్శకులు నటీనటులకు కథ నెరేట్ చేశారంటే వారి మధ్య అనధికారిక నాన్ డిస్‌క్లోజర్ అగ్రిమెంట్ ఉన్నట్లే లెక్క. దీని ప్రకారం స్టోరీని ఎవరికీ చెప్పకూడదు. కానీ, ఆమె ఈ ఒప్పందాన్ని బ్రేక్ చేసి లీక్ చేేస ప్రయత్నం చేస్తున్నారు’’ అంటూ ఆయన పోస్ట్ పెట్టారు. అయితే నటి దీపికా పదుకొణెను ఉద్దేశించే సందీప్ ఈ పోస్ట్ పెట్టినట్లు ఇండస్ర్టీలో టాక్ నడుస్తోంది. ప్రస్తుతం తన బిడ్డ కోసం సమయం కేటాయిస్తున్న దీపిక ఎనిమిది గంటల షిఫ్ట్ కోరినట్లు టాక్ నడిచింది. అంతేకాకుండా రూ.25 కోట్ల పారితోషికం డిమాండ్ చేశారని వార్తలు వచ్చాయి. దీంతో వీరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని బాలీవుడ్‌లో కథనాలు వెలువడ్డాయి